పోలీస్ స్పోర్ట్స్ & గేమ్స్ మీట్‌.. కరీంనగర్ పోలీసులకు 14 పతకాలు

కలం, కరీంనగర్: 5వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ & గేమ్స్ మీట్–2026లో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌ (Karimnagar Police)కు చెందిన పోలీస్ అధికారులు, సిబ్బంది టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ విభాగాల్లో అద్భుత ప్రతిభ కనబరిచి మొత్తం 16 పతకాలు సాధించారు. ఇందులో 9 బంగారు, 4 వెండి, 3 కాంస్య పతకాలు సాధించినట్లు క్రీడా ఫలితాల వివరాల్లో పేర్కొన్నారు. మహిళల విభాగంలో ఏసీపీ మాధవి టేబుల్ టెన్నిస్‌లో ఓపెన్ సింగిల్స్, 40+ సింగిల్స్, ఓపెన్ డబుల్స్ విభాగాల్లో బంగారు పతకాలు సాధించారు. బ్యాడ్మింటన్‌లో 50+ సింగిల్స్‌లో బంగారు, మిక్స్‌డ్ డబుల్స్ 40+ విభాగంలో కాంస్య పతకం సాధించారు.

డబ్ల్యూపీసీ స్వప్న టేబుల్ టెన్నిస్‌లో 40+ డబుల్స్, ఓపెన్ డబుల్స్ విభాగాల్లో బంగారు పతకాలు, ఓపెన్ సింగిల్స్‌లో వెండి పతకం సాధించారు. బ్యాడ్మింటన్ 40+ డబుల్స్‌లోనూ బంగారు పతకం కైవసం చేసుకున్నారు. ఏఎస్ఐ పి. ఉమారాణి టేబుల్ టెన్నిస్‌లో 40+ డబుల్స్‌లో బంగారు, 40+ సింగిల్స్, 50+ మిక్స్‌డ్ డబుల్స్ విభాగాల్లో వెండి, 50+ సింగిల్స్‌లో కాంస్య పతకాలు సాధించారు. బ్యాడ్మింటన్‌లో 50+ మిక్స్‌డ్ డబుల్స్, 40+ డబుల్స్, 50+ సింగిల్స్ విభాగాల్లో బంగారు పతకాలు గెలుచుకున్నారు.

హెచ్‌సీ సంజయ్ టేబుల్ టెన్నిస్ 50+ మిక్స్‌డ్ డబుల్స్‌లో వెండి, బ్యాడ్మింటన్ 40+ మిక్స్‌డ్ డబుల్స్‌లో కాంస్య పతకం సాధించగా, ఏఎస్ఐ సత్తయ్య బ్యాడ్మింటన్ 50+ మిక్స్‌డ్ డబుల్స్‌లో బంగారు పతకం సాధించారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచి కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌కు గుర్తింపు తీసుకువచ్చిన అధికారులు, సిబ్బందిని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, ఐపీఎస్ అభినందించారు. విధి నిర్వహణతో పాటు క్రీడల్లోనూ ప్రతిభను చాటడం అభినందనీయమని పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>