కలం, కరీంనగర్: 5వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ & గేమ్స్ మీట్–2026లో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ (Karimnagar Police)కు చెందిన పోలీస్ అధికారులు, సిబ్బంది టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ విభాగాల్లో అద్భుత ప్రతిభ కనబరిచి మొత్తం 16 పతకాలు సాధించారు. ఇందులో 9 బంగారు, 4 వెండి, 3 కాంస్య పతకాలు సాధించినట్లు క్రీడా ఫలితాల వివరాల్లో పేర్కొన్నారు. మహిళల విభాగంలో ఏసీపీ మాధవి టేబుల్ టెన్నిస్‌లో ఓపెన్ సింగిల్స్, 40+ సింగిల్స్, ఓపెన్ డబుల్స్ విభాగాల్లో బంగారు పతకాలు సాధించారు. బ్యాడ్మింటన్‌లో 50+ సింగిల్స్‌లో బంగారు, మిక్స్డ్ డబుల్స్ 40+ విభాగంలో కాంస్య పతకం సాధించారు.
డబ్ల్యూపీసీ స్వప్న టేబుల్ టెన్నిస్‌లో 40+ డబుల్స్, ఓపెన్ డబుల్స్ విభాగాల్లో బంగారు పతకాలు, ఓపెన్ సింగిల్స్‌లో వెండి పతకం సాధించారు. బ్యాడ్మింటన్ 40+ డబుల్స్‌లోనూ బంగారు పతకం కైవసం చేసుకున్నారు. ఏఎస్ఐ పి. ఉమారాణి టేబుల్ టెన్నిస్‌లో 40+ డబుల్స్‌లో బంగారు, 40+ సింగిల్స్, 50+ మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో వెండి, 50+ సింగిల్స్‌లో కాంస్య పతకాలు సాధించారు. బ్యాడ్మింటన్‌లో 50+ మిక్స్డ్ డబుల్స్, 40+ డబుల్స్, 50+ సింగిల్స్ విభాగాల్లో బంగారు పతకాలు గెలుచుకున్నారు.
హెచ్‌సీ సంజయ్ టేబుల్ టెన్నిస్ 50+ మిక్స్డ్ డబుల్స్‌లో వెండి, బ్యాడ్మింటన్ 40+ మిక్స్డ్ డబుల్స్‌లో కాంస్య పతకం సాధించగా, ఏఎస్ఐ సత్తయ్య బ్యాడ్మింటన్ 50+ మిక్స్డ్ డబుల్స్‌లో బంగారు పతకం సాధించారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచి కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌కు గుర్తింపు తీసుకువచ్చిన అధికారులు, సిబ్బందిని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, ఐపీఎస్ అభినందించారు. విధి నిర్వహణతో పాటు క్రీడల్లోనూ ప్రతిభను చాటడం అభినందనీయమని పేర్కొన్నారు.

