శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్: నేడు రూ.300 టికెట్ల విడుదల!

కలం, వెబ్ డెస్క్ : తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ రోజు ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల (TTD Tickets) కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. భక్తులు ఈ నెల 12, 13, 14, 18, 19, 20 తేదీలకు సంబంధించి (https://ttdevasthanams.ap.gov.in) వెబ్‌సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చని సూచించింది.

బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 11 నుంచి 20 వరకు ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా మిగిలిన అన్ని రకాల వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. అదేవిధంగా వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు, ఎన్ఆర్ఐలు, డిఫెన్స్ కేటగిరీల ప్రత్యేక దర్శనాలను కూడా ఈ 10 రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>