సదరం సర్టిఫికెట్ల జారీపై కలెక్టర్ కీలక ఆదేశాలు

కలం, నిర్మల్ : అర్హులైన దివ్యాంగులందరికీ సదరం(Sadarem) ధ్రువీకరణ పత్రాలు అందించేలా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Bhavesh Mishra) ఆదేశించారు. మంగళవారం సాయంత్రం నిర్మల్ జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సదరం ధ్రువీకరణ పత్రాల జారీపై సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఇప్పటివరకు నిర్వహించిన సదరం శిబిరాలు, జారీ చేసిన సదరం సర్టిఫికెట్లు, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల సంఖ్య తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు సదరం శిబిరాలు నిర్వహించి, అర్హులకు పారదర్శకంగా సదరం ధ్రువీకరణ పత్రాలు అందజేయాలని సూచించారు. దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రక్రియను నిర్వహించాలన్నారు. సదరం శిబిరాల వద్ద అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. వెయిటింగ్‌ లిస్టులో ఉన్న దివ్యాంగులకు శిబిరాల నిర్వహణ తేదీ, సమయం వివరాలను ముందుగానే తెలియజేయాలని అన్నారు. ఈ సమావేశంలో డీఆర్డీఓ విజయలక్ష్మి, జిల్లా ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి పర్యవేక్షకులు గోపాల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>