సుప్రీం కోర్టులో కొలువుదీరిన ముగ్గురు కొత్త జడ్జిలు

కలం, వెబ్ డెస్క్: సుప్రీం కోర్టు (Supreme Court)లో కొత్తగా ముగ్గురు న్యాయమూర్తులు కొలువుదీరారు. జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ సునీతా అగర్వాల్, జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయతో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం చేయించారు. ఈ ముగ్గురి రాకతో సుప్రీం కోర్టులో జడ్జిల సంఖ్య 37కి చేరింది. మొత్తం జడ్జిల సంఖ్య 38గా ఉండగా.. మరో ఖాళీ ఉంది. ఈ ఏడాదే సుప్రీం కోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను 34 నుంచి 38కి పెంచుతూ పార్లమెంట్ చట్టం చేసింది. కొత్తగా నియమితులైనవారిలో జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ తెలంగాణ హై కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి పదోన్నతి పొందారు.

ముగ్గురు మహిళా జడ్జిలు..

జస్టిస్ సునీతా అగర్వాల్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించడంతో సుప్రీంకోర్టు(Supreme Court)లో మొత్తం మహిళా జడ్జిల సంఖ్య మూడుకు చేరింది. జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ వి.మోహన ఇప్పటికే పనిచేస్తున్నారు. వీరిలో జస్టిస్ బీవీ నాగరత్న 2027 సెప్టెంబర్ 24న భారత ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టబోతున్నారు. సీనియార్టీ ప్రకారం ఆమెకు ఈ అవకాశం దక్కబోతుంది. సీజేఐ కాబోతున్న తొలి మహిళా న్యాయమూర్తిగా ఆమె రికార్డు నెలకొల్పే అవకాశం ఉంది.

Also Read : జ్ఞానేష్ కుమార్‌కు ఎందుకు భయం?: రాహుల్ గాంధీ

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>