కలం, స్పోర్ట్స్ : ఢిల్లీ క్యాపిటల్స్‌లో సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) రీఎంట్రీ ఇచ్చాడు. 2027 ఐపీఎల్ సీజన్‌కు జట్టు హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. గత రెండు సీజన్లలో ప్లేఆఫ్స్‌కు చేరలేకపోయిన డీసీకి ఇప్పుడు గంగూలీ మార్గనిర్దేశం చేయనున్నాడు. హెమంగ్ బదానీ స్థానంలో గంగూలీ బాధ్యతలు తీసుకోనున్నాడు. డీసీతో గంగూలీకి ఇప్పటికే సుదీర్ఘ అనుబంధం ఉంది. 2019లో గంగూలీ డీసీలో అడ్వైజర్‌గా చేరాడు. ఆ తర్వాత పురుషులు, మహిళల జట్లకు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా కూడా పనిచేశాడు. గత ఏడాది డీసీకి చెందిన ఎస్ఏ20 జట్టు ప్రిటోరియా క్యాపిటల్స్‌కు హెడ్ కోచ్‌గా కూడా వ్యవహరించాడు. ఇప్పుడు ఐపీఎల్లో హెడ్ కోచ్‌గా కొత్త బాధ్యత తీసుకుంటున్నాడు. డీసీ తనకు ఎంతో దగ్గరైన ఫ్రాంచైజీ అని గంగూలీ తెలిపాడు.
జట్టు యాజమాన్యం, మేనేజ్మెంట్, సహాయక సిబ్బంది, ఆటగాళ్లతో తనకు మంచి అనుబంధం ఉందని పేర్కొన్నాడు. ప్రస్తుతం జట్టులో ప్రతిభ ఉన్న ఆటగాళ్లు ఉన్నారని గంగూలీ (Sourav Ganguly) అభిప్రాయపడ్డాడు. కొత్త సీజన్లో బలమైన, భయపడని జట్టును నిర్మించడమే తన లక్ష్యమని తెలిపాడు. గంగూలీ నియామకాన్ని డీసీ సహ యజమాని పార్థ్ జిందాల్ స్వాగతించాడు. గంగూలీ ఎప్పటి నుంచో డీసీ కుటుంబంలో కీలక భాగమని పేర్కొన్నాడు. అతడి నాయకత్వంలో జట్టు ఐపీఎల్ టైటిల్ కోసం మరింత బలంగా సిద్ధమవుతుందని జిందాల్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

