శ్రీశైలంలో శరన్నవరాత్రి వేడుకలు.. చంద్రబాబు, లోకేశ్‌కు ఆహ్వానం

కలం, వెబ్‌ డెస్క్‌: ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం (Srisailam Devasthanam) ఆధ్వర్యంలో నిర్వహించనున్న దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్‌ను ఆలయ అధికారులు ఆహ్వానించారు.

ఈ మేరకు దేవస్థానం (Srisailam Devasthanam) ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారులు ఉండవల్లిలో వారిని కలిసి ఉత్సవాల ఆహ్వాన పత్రికలను అందజేశారు. అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు పది రోజుల పాటు శరన్నవరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి.

ఉత్సవాల్లో భాగంగా శ్రీభ్రమరాంబికా దేవి తొమ్మిది రోజుల పాటు వివిధ నవదుర్గ అలంకారాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ప్రతిరోజూ నవావరణ పూజలు, చండీయాగం, రుద్రయాగం, కుంకుమార్చనలు, చతుర్వేద పారాయణాలు నిర్వహించనున్నారు. సువాసినీ, కుమారీ పూజలను కూడా ప్రత్యేకంగా చేపట్టనున్నారు. రాత్రివేళల్లో స్వామి, అమ్మవార్లకు వివిధ వాహన సేవలతో గ్రామోత్సవాలు నిర్వహించనున్నారు.

భృంగి, మయూర, రావణ, హంస, శేష, గజ, అశ్వ వాహనాలపై ఉత్సవమూర్తుల ఊరేగింపు జరగనుంది. అక్టోబర్ 20న విజయదశమి సందర్భంగా పూర్ణాహుతి, ఆయుధ పూజ, శమీ పూజ నిర్వహిస్తారు. అనంతరం లక్ష్మీనరసింహ స్వామి ఆలయం సమీపంలోని పుష్కరిణిలో తెప్పోత్సవం నిర్వహించి శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా ముగించనున్నారు.

అమ్మవారి అలంకారాల వివరాలు:

అక్టోబర్ 11 (ఆదివారం): శైలపుత్రి
అక్టోబర్ 12 (సోమవారం): బ్రహ్మచారిణి
అక్టోబర్ 13 (మంగళవారం): చంద్రఘంట
అక్టోబర్ 14 (బుధవారం): కూష్మాండ
అక్టోబర్ 15 (గురువారం): స్కందమాత
అక్టోబర్ 16 (శుక్రవారం): కాత్యాయని
అక్టోబర్ 17 (శనివారం): కాళరాత్రి
అక్టోబర్ 18 (ఆదివారం): మహాగౌరి
అక్టోబర్ 19 (సోమవారం): సిద్ధిదాత్రి
అక్టోబర్ 20 (మంగళవారం): నిజరూప దర్శనం (విజయదశమి)

Also Read : 16 వేల రాజకీయ పదవులు పోగొట్టారు.. వైసీపీపై అచ్చెన్నాయుడు ఫైర్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>