ఖానాపూర్ అభివృద్ధిపై కలెక్టర్‌, ఎమ్మెల్యే ఫోకస్‌

కలం, ఖానాపూర్: ఖానాపూర్ (Khanapur) మండలంలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఖానాపూర్ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన మండల సమీక్షా సమావేశంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలంలోని పలు సమస్యలను ఎమ్మెల్యే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. భూముల అక్రమ కబ్జాలు (Land Encroachment), అసైన్డ్ భూముల్లో అనుమతులు లేకుండా మొర్రం తవ్వకాలు, అక్రమ వెంచర్లు, అటవీశాఖకు సంబంధించిన సమస్యలపై చర్యలు తీసుకోవాలని కోరారు.

కడెం మండలంలో హరిత రిసార్ట్ పేరుతో భూమి ఆక్రమణకు గురవుతున్నాయని, దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఖానాపూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ భూములను గుర్తించి, అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి స్థలాలు కేటాయించాలని ఎమ్మెల్యే కోరారు. ప్రజలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడంతో పాటు అభివృద్ధి పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని కలెక్టర్, ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>