మోపాల్‌లో SIRకు వ్యతిరేకంగా నిరసన

కలం, నిజామాబాద్ బ్యూరో : దేశవ్యాప్తంగా జరుగుతున్న సర్ ప్రక్రియను వెంటనే ఆపేయాలని భారత ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తన పదవికి తక్షణమే రాజీనామా చేయాలని ఇండియా కూటమి వామపక్ష పార్టీల (INDIA Bloc Parties) ఆధ్వర్యంలో మోపాల్ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్, CPI, CPI (ML) న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు కంజర భూమయ్య, వేల్పూర్ భూమయ్య, వేల్పూర్ కిషన్‌లు మాట్లాడుతూ.. భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న సర్ ప్రక్రియకు సంబంధించిన ప్రజల్లో పలు సందేహాలు ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయనీ అన్నారు.

ఎన్నికల కమిషన్‌లొ అవకతవకలు జరిగినట్టు బయట పౌర సమాజానికి విషయం తెలిసిందని పేర్కొన్నారు. ఈ సందర్భంలో ఎస్ఐఆర్‌ని నిలిపివేస్తూ ఎన్నికల కమిషన్‌లొ అవకతవకలకు పాల్పడిన జ్ఞానేశ్ కుమార్ ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.

ఈ నేపథ్యంలో సర్ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసము, పారదర్శకత, నిష్పక్షపాత, భావన మరింత బలపడే విధంగా అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు. ఎన్నికల కమిషన్‌లొ జరిగిన అవకతవకలపై న్యాయ విచారణ చేయించాలని ప్రజాస్వామ్య విలువలు ఓటు హక్కు పరిరక్షణకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వానికి కోరారు.

ఈ కార్యక్రమంలో న్యూడెమోక్రసీ నాయకులు అగ్గు చిన్నయ్య, సీపీఐ నాయకులు అడికే రాజేశ్వర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు వేల్పూర్ కిషన్, కంజర సాయిలు, బాబు, నర్సింపల్లి సాయిలు, వేల్పూర్ గంగారం, వేల్పూర్ రమేష్, సిహెచ్ సాయి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>