మాల్స్ అక్రమ నిర్మాణాలపై విచారణ జరపాలి: AAP

కలం, నిర్మల్: నిర్మల్ పట్టణంలోని షాపింగ్ మాల్స్‌లో పార్కింగ్ నిబంధనల ఉల్లంఘనలతో పాటు ఫుట్‌పాత్‌ల ఆక్రమణలపై సమగ్ర విచారణ జరిపించాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ (Nirmal AAP) ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.

రాష్ట్ర జాయింట్‌ సెక్రటరీ సయ్యద్‌ హైదర్‌ మాట్లాడుతూ.. పట్టణంలోని ఆనంద్‌, చెన్నై, మాంగళ్య, ఎల్‌వీఆర్‌, చందన బ్రదర్స్‌ తదితర షాపింగ్‌ మాల్స్‌లో సరైన పార్కింగ్‌ వసతులు లేకపోవడంతో వినియోగదారులు రోడ్లు, ఫుట్‌పాత్‌లపై వాహనాలు నిలుపుతున్నారని, దీంతో ట్రాఫిక్‌కు, పాదచారుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.

ఆక్రమణకు గురైన ఫుట్‌పాత్‌లను వెంటనే ఖాళీ చేయించాలని కోరారు. పార్కింగ్‌ నిబంధనలను ఉల్లంఘిస్తూ నిర్మాణాలు జరుగుతున్నా పట్టించుకోని మున్సిపల్‌ అధికారుల తీరుపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు వినోద్‌ కుమార్‌, అబ్దుల్‌ సాధిక్‌ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>