బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ అరెస్ట్

కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్‌ (Manne Krishank)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబానికి సంబంధించి 50 వేల కోట్ల బినామీ పెట్టుబడుల అవినీతిపై గళమెత్తినందుకే అరెస్టు చేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. రేవంత్ రెడ్డి కుటుంబ ఆస్తులు, వ్యాపారాల అక్రమాలపై ప్రశ్నించినందుకే ఈ చర్యకు పాల్పడ్డారని బీఆర్ఎస్ వర్గాలు మండిపడుతున్నాయి.

అరెస్ట్ అనంతరం పోలీసులు ఆయనను ప్రాథమిక వైద్య పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. క్రిశాంక్ ముందస్తు అరెస్ట్‌తో ఆసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>