గిరిజన యువతకు గుడ్‌న్యూస్‌.. ఖాకీ కొలువులకు ఉచిత కోచింగ్‌

కలం, వనపర్తి : పోలీసు ఉద్యోగాలకు సిద్ధమవుతున్న గిరిజన యువతీ యువకులకు 60 రోజుల పాటు ఉచిత పోలీస్‌ శిక్షణ (Free Police Coaching) ఇవ్వనున్నట్లు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ITDA–PVTG–చెంచు) మన్ననూర్‌ ప్రాజెక్టు అధికారి పత్రికా ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌, వికారాబాద్‌ జిల్లాలకు చెందిన అర్హులైన ఆదివాసీ, గిరిజన యువతీయువకులకు పోలీసు కానిస్టేబుల్‌, ఎస్‌ఐ ఉద్యోగాలకు అవసరమైన శిక్షణ అందించనున్నట్లు పేర్కొన్నారు.

స్పెషల్‌ ట్రైనింగ్‌ ద్వారా మొత్తం 100 మంది అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఎంపికైన వారికి సుమారు రెండు నెలల పాటు ఉచిత రెసిడెన్షియల్‌ కోచింగ్‌ అందిస్తారు. అభ్యర్థులు రూ.3 లక్షల ఆదాయ పరిమితికి సంబంధించిన ఇన్‌కమ్‌ సర్టిఫికెట్‌తో పాటు పాఠశాల, ఆధార్‌ కార్డు, స్టడీ సర్టిఫికెట్లు, పోలీసు ఉద్యోగానికి దరఖాస్తు చేసిన పత్రం సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ నిబంధనలకు అనుగుణంగా ఉండాలని అధికారులు తెలిపారు.

ముఖ్య తేదీలు..

. దరఖాస్తుల ప్రారంభం: అక్టోబరు 5, 2026
. దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ: అక్టోబరు 9, సాయంత్రం 5 గంటల వరకు
. స్క్రీనింగ్‌ టెస్ట్‌: అక్టోబరు 15
. జాబితా విడుదల: అక్టోబరు 16
. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌: అక్టోబరు 17
. తుది ఫలితాలు: అక్టోబరు 19
. శిక్షణ ప్రారంభం: అక్టోబరు 21

అభ్యర్థులు తమ జిల్లాలోని గిరిజన అభివృద్ధి అధికారి కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు ఐటీడీఏ కార్యాలయం, మన్ననూర్‌/జిల్లా గిరిజన అభివృద్ధి కార్యాలయం నాగర్‌కర్నూల్‌లో దరఖాస్తులు అందజేయవచ్చని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>