టైగర్ జోన్ పేరుతో ఇళ్ల నిర్మాణం అడ్డుకోవద్దు.. సీపీఐ డిమాండ్

కలం, నిర్మల్: కడెం మండలం ఇస్లాంపూర్‌ గ్రామ పరిధిలోని కొలంగూడ (Kolamguda) గిరిజనులకు ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అటవీశాఖ అధికారులు వెంటనే అనుమతులు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ ప్రజాపంథా (CPI Mass Line) ఆధ్వర్యంలో సోమవారం నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆందోళన (Protest) చేపట్టారు. ఈ సందర్భంగా ఆ పార్టీ ఉమ్మడి జిల్లా కార్యదర్శి నంది రామయ్య మాట్లాడుతూ.. గత ఏడాది నవంబర్‌లో కొలంగూడ గిరిజనులకు సుమారు 31 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని తెలిపారు.

అయితే టైగర్‌ జోన్‌ పేరుతో అటవీశాఖ అధికారులు ఇళ్ల నిర్మాణాలను నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను ఖానాపూర్‌ ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు పరిష్కారం కాలేదన్నారు. టైగర్‌ జోన్‌ పేరుతో పేద గిరిజనులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదని పేర్కొన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణానికి అటవీశాఖ అధికారులు వెంటనే అనుమతులు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. సమస్యను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.

Also Read : బోరిగాం రైతుల ఆందోళన.. సాగు నీటి కోసం డిమాండ్‌

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>