కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం (Prajavani Programme) నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్‌లో రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎక్సైజ్, సాంస్కృతిక శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించిన నేపథ్యంలో ఆర్డీఓ కార్యాలయంలో ప్రజావాణి కొనసాగింది.
ఈ సందర్భంగా జిల్లా అధికారులు ప్రజల నుంచి అర్జీలు, వినతులు స్వీకరించారు. వివిధ సమస్యలపై ప్రజలు అధికారులను కలిసి తమ సమస్యలను వివరించి పరిష్కరించాలని కోరారు. సంబంధిత శాఖల అధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

