సీఈసీ తొలగింపు పిటిషన్ పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు!

కలం, వెబ్ డెస్క్: ఓటర్ల జాబితాల సమగ్ర సవరణ ప్రక్రియలో ఏకపక్ష నిర్ణయాలకు బాధ్యుడిని చేస్తూ ముఖ్య ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ (Gyanesh Kumar) ను సస్పెండ్ చేయాలని దాఖలైన పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టు (Supreme Court) విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేస్తూ, పూర్తి వివరాలతో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ఆదేశించింది.

ఈ క్రమంలోనే ఎన్నికల సంఘం నిర్ణయాలు ఏకగ్రీవంగా తీసుకున్నారా? లేక ఏకపక్షంగా జరిగాయా? అనే విషయాన్ని స్పష్టం చేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఒకవేళ నిర్ణయాలు ఏకపక్షమని తేలితే చర్యలు తప్పవని హెచ్చరించింది. అయితే వెంటనే సీఈసీ(CEC Gyanesh Kumar)ని సస్పెండ్ చేయాలన్న పిటిషనర్ల అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

ఈ విచారణలో భాగంగా 2023 ఎన్నికల కమిషన్ చట్టంలోని సెక్షన్ 16 ద్వారా సీఈసీకి కల్పించిన చట్టపరమైన రక్షణ (ఇమ్యూనిటీ) పై తీవ్ర వాదనలు జరిగాయి. గత చట్టాల్లో లేని విధంగా, రాజ్యాంగ విరుద్ధమైన రీతిలో సీఈసీకి ఇమ్యూనిటీ కల్పించారని, ప్రధాని లేదా సుప్రీంకోర్టు జడ్జిలకు కూడా లేని ఇమ్యూనిటీని కేవలం రాష్ట్రపతికి ఉన్న తరహాలో సీఈసీకి ఇచ్చారని పిటిషనర్ వాదించారు. దీనిపై స్పందించిన సీజేఐ, సీఈసీని వెంటనే తొలగిస్తే ఎన్నికలను ఎవరు నిర్వహిస్తారని ప్రశ్నించగా.. కమిషన్‌లో ఉన్న ఇద్దరు ఈసీలు ఆ బాధ్యతలు చూసుకుంటారని పిటిషనర్ తెలిపారు.

అలాగే ఫామ్ 6లో జరిగిన మార్పులు, ఓటర్ల సవరణలపై సీజేఐ (CJP) స్పందిస్తూ.. ఫామ్ 6లో అక్రమంగా మార్పులు చేసిన వారిని తేలుస్తామని హామీ ఇచ్చారు. అయితే కేవలం న్యూస్ రిపోర్టుల ఆధారంగా ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోలేమని, పూర్తి రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన తాము తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈసీ దాఖలు చేసే కౌంటర్ పిటిషన్ ఆధారంగా తదుపరి విచారణ కొనసాగనుంది.

Also Read : ఫ్యాన్స్ మీట్‌తో హల్‌చల్.. రాజకీయాల్లోకి మరో హీరో ఎంట్రీ..!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>