కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలో నూతనంగా ప్రారంభమైన షాపింగ్ మాల్స్‌కు (Shopping Malls) సరైన పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో రహదారులపైనే వాహనాలను నిలుపుతున్నారని బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపించారు. దీంతో ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆర్డీఓ కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతూ.. ఇటీవల చెన్నై చందన బ్రదర్స్, మాంగళ్య తదితర షాపింగ్ మాల్స్ ప్రారంభమయ్యాయని తెలిపారు. ఆయా మాల్స్‌లో సరైన పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో వినియోగదారులు రహదారులపైనే వాహనాలను నిలుపుతున్నారని పేర్కొన్నారు. దీంతో ప్రధాన రహదారులపై ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతోందని అన్నారు.
ఇటీవల ట్రాఫిక్‌లో అంబులెన్స్ కూడా చిక్కుకుందని తెలిపారు. అనుకోని ప్రమాదం జరిగితే అత్యవసర వాహనాలకు మార్గం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. పార్కింగ్ సదుపాయం లేకుండా షాపింగ్ మాల్స్‌కు అనుమతులు ఎలా ఇచ్చారని అధికారులను నిలదీశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ నాయకులు కోరారు. సమస్యను పరిష్కరించకపోతే బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
Also Read : సీఈసీ తొలగింపు పిటిషన్ పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
Follow Us On : WhatsApp

