కాకా ఆశయాలు ముందుకు తీసుకెళ్లడమే నిజమైన నివాళి: బత్తుల లక్ష్మారెడ్డి

కలం, మిర్యాలగూడ: పేదలు, కార్మికులు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి (కాకా) చేసిన సేవలు అమూల్యమైనవని మిర్యాలగూడ ఎమ్మెల్యే (Miryalaguda MLA) బత్తుల లక్ష్మారెడ్డి (Bathula Laxma Reddy) అన్నారు. కాకా 97వ జయంతి సందర్భంగా సోమవారం మిర్యాలగూడ పట్టణంలోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే బత్తుల పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. సమాజంలో వెనుకబడిన వర్గాల హక్కుల కోసం, సామాజిక న్యాయం కోసం కాకా నిరంతరం పోరాడారని కొనియాడారు. ప్రజా సేవ పట్ల ఆయనకు ఉన్న నిబద్ధత, క్రమశిక్షణ నేటి రాజకీయ నాయకులకు, యువతరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే కాకాకు ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు. కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని కాకాకు అంజలి ఘటించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>