కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లాలో వివిధ అభివృద్ధి పనులకు రాష్ట్ర మంత్రులు సోమవారం శంకుస్థాపనలు చేశారు. జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి(Minister Ponguleti), ఎక్సైజ్, సాంస్కృతిక శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు (minister Jupally), జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రాతో కలిసి రూ. 23.35 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శిలాఫలకాలను ఆవిష్కరించి శంకుస్థాపనలు చేశారు.
వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టనున్న గోదావరి పుష్కరాలకు సంబంధించిన రహదారుల నిర్మాణ పనులతో పాటు రిజిస్ట్రార్ కార్యాలయాలు, తహశీల్దార్ కార్యాలయాలు, ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాలకు సంబంధించిన నిర్మాణ పనులకు మంత్రులు శ్రీకారం చుట్టారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, ప్రభుత్వ సేవలు అందించేందుకు చేపడుతున్న ఈ పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులు చర్యలు చేపట్టనున్నారు. జిల్లా పర్యటనకు నిర్మల్ (Nirmal) చేరుకున్న మంత్రులు పొంగులేటి, జూపల్లి కృష్ణారావు, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల ఉన్నతాధికారులు డీఎస్. లోకేష్‌కుమార్, రాజీవ్‌గాంధీ హనుమంతు, వీపీ. గౌతమ్‌లకు జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, అధికారులు ఘన స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో నిర్మల్, ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల కలెక్టర్లు భవేశ్ మిశ్రా, రాజర్షి షా, హరిత, అదనపు కలెక్టర్లు రాథోడ్ రమేష్, ఆర్ ఎస్ చిత్రు, చంద్రయ్య, రాములు, డేవిడ్, ఎమ్మెల్సీ దండే విఠల్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జ పటేల్, ముదోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఉట్నూర్ ఐటీడీఏ పీఓ మంద మకరందు, సబ్ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
Also Read : ఫ్యాన్స్ మీట్‌తో హల్‌చల్.. రాజకీయాల్లోకి మరో హీరో ఎంట్రీ..!
Follow Us On: Youtube

