న్యాయం కోసం వెళ్లి.. కలెక్టరేట్‌లో ఆత్మహత్యాయత్నం

కలం, వరంగల్ జిల్లా: భూవివాదంలో అధికారులు న్యాయం చేయడం లేదని మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి వరంగల్ కలెక్టరేట్ (Warangal Collectorate) గ్రీవెన్స్‌లో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. బాధితుడు గట్ల సురేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. తన సోదరుడు గట్ల రాజు, డ్యాగల కొమురయ్య సంతకాన్ని ఫోర్జరీ చేసి 2003లో తమ భూమిని కబ్జా చేశాడని ఆరోపించారు.

ఈ విషయంపై అప్పటి నుంచి పలుమార్లు అధికారులను ఆశ్రయించి న్యాయం చేయాలని వేడుకున్నప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని (Gatla Surender) వాపోయారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై కలెక్టరేట్ గ్రీవెన్స్‌లో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిపారు. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే అడ్డుకుని ఆయనను రక్షించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>