ప్రభుత్వ ఉద్యోగులకు EHS సౌకర్యం కల్పించాలి : NTSF, TTU

కలం, జోగుళాంబ గద్వాల: బీసీ రాజ్యాధికారం పాదయాత్రలో భాగంగా గద్వాలకు వచ్చిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను ఆదివారం నడిగడ్డ తెలంగాణ సోషల్ ఫోరం (NTSF), TTU ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కర్నూల్ ప్రైవేటు ఆసుపత్రులలో నడిగడ్డ ప్రాంత ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ సౌకర్యం కల్పించి మెరుగైన వైద్యం అందేలా శాసనమండలి దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో నడిగడ్డ తెలంగాణ సోషల్ ఫోరం అధ్యక్షులు పాల్వాయి లక్ష్మీనారాయణ, TTU జిల్లా అధ్యక్షులు బుచ్చన్న, NTSF ప్రధాన కార్యదర్శి కొండాపురం ప్రతాప్, రాజు సాగర్,‌ నర్సింహుల గౌడ్, నర్సింహులు, శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>