కలం, వెబ్ డెస్క్ : వికారాబాద్ జిల్లా అనంతగిరి ఘాట్ రోడ్డులో ప్రమాదం (Ananthagiri Bus Accident) చోటుచేసుకుంది. యాచారం నుంచి బానూరు వైపు వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు అనంతగిరి ఘాట్ రోడ్డు వద్దకు రాగానే అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, 20 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు, పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని అత్యవసర చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఘటనా స్థలంలో రెస్క్యూ ప్రక్రియ కొనసాగుతోంది.

