కలం, కరీంనగర్ బ్యూరో: రాష్ట్రాన్ని రెండో రోజు పొగ మంచు(Dense Fog) కమ్మేసింది. పొగమంచు దట్టంగా కమ్ముకోవడంతో ఉదయం వివిధ పనులకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దట్టమైన పొగ మంచు కారణంగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. అలాగే ఉత్తర, దక్షిణ భారత దేశం మధ్య పలు రైళ్లు(Trains) ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీ(Delhi) నుంచి వస్తున్న రైళ్లు సుమారుగా 5 గంటల నుంచి 6 గంటల ఆలస్యంగా నడుస్తున్నాయి. రైళ్ల రాకపోకలు ఆలస్యం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోవడంతో చలితో ప్రజలు గజగజ వణుకుతున్నారు.


