కలం వెబ్ డెస్క్ : ఛత్తీస్‌ఘడ్‌లోని (Chhattisgarh) బీజాపూర్ జిల్లాలో డీఆర్ జీ దళాలు మరో భారీ ఎన్ కౌంటర్ (Bijapur Encounter) చేపట్టాయి. శనివారం ఉదయం భద్రతా దళాలు బీజాపూర్ కిస్సారం అడవుల్లో ఈ ఆపరేషన్ నిర్వహించాయి. భద్రతా దళాలకు, మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో 14 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఎన్‌కౌంటర్‌తో కొంటా కమిటీ పూర్తిగా హతమైనట్లు అధికారులు ప్రకటించారు. వీరిలో కొంటా ఏరియా కమిటీ సభ్యుడు సచిన్ మగ్ధూ సైతం ఉన్నట్లు వెల్లడించారు. భద్రతా దళాలు ఘటనా స్థలంలో మూడు ఏకే 47 తుపాకీలతో పాటు, ఇన్సాస్ వంటి ఆటోమేటిక్ ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ ఆపరేషన్‌ను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఇదిలా ఉండగా కొన్టా ఏఎస్పీ ఆకాశ్ రావ్ గిర్‌పుంజే హత్యలో పాల్గొన్న నక్సలైట్ కమాండర్లు అందరూ ఎన్‌కౌంటర్‌లో హతమైనట్లు భద్రతా వర్గాలు స్పష్టం చేశాయి.

Read Also: మావోయిస్టు అగ్రనేత కంకణాల రాజిరెడ్డితో సహా 20 మంది లొంగుబాటు.. నేడు డీజీపీ ప్రకటన
Follow Us On: Instagram


