ఢిల్లీలో కొనసాగుతున్న నిరసనలు.. కీలక ప్రకటన!

కలం, వెబ్ డెస్క్: కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషన్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలంటూ దేశ వ్యాప్తంగా కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janta Party) ఆందోళనలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోనూ పెద్ద ఎత్తున యువత జంతర్ మంతర్ వద్దకు నిరసనకు దిగారు. జ్ఞానేష్ కుమార్ కుట్రపూరితంగా దేశ ప్రజలు ఓట్లు తొలగిస్తున్నారని.. ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

జంతర్ మంతర్ ప్రాంతంలో నిరసన చేసేందుకు అనుమతి లేదని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. ఇప్పటివరకు 1,100 మందిని అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఆందోళనలు చేస్తున్నవారిని కేవలం అరెస్ట్ చేశామని.. ఎలాంటి కేసులు నమోదు చేయలేదన్నారు. సాయంత్రానికి వారిని వదిలిపెడుతామన్నారు. జంతర్ మంతర్ వద్ద గతంలో చోటు చేసుకున్న ఘటనల నేపథ్యంలో.. ముందు జాగ్రత్త చర్యగానే అనుమతి నిరాకరించినట్లు సమర్థించుకున్నారు.

పోలీసులు వర్సెస్ ఆందోళనకారులు..

ఉదయం నుంచే జంతర్ మంతర్ చుట్టు పక్కల ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు.. నిరసనకారులు ఎవరూ జంతర్ మంతర్ వైపు వెళ్లకుండా అడ్డుకున్నారు. ముందు జాగ్రత్త చర్యగా అర్ధరాత్రి నుంచే కీలకమైన 11 మెట్రో స్టేషన్లను కూడా మూసివేశారు. ఇంత చేసినా యువత పెద్ద ఎత్తున అక్కడికి తరలిరావడంతో పోలీసులు వారిని నిలువరించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య పెనుగులాట జరిగింది. ఈ ఘటనలో పలువురు పోలీస్ సిబ్బంది కూడా గాయపడినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>