ఖైదీల‌ను మంచి పౌరులుగా తీర్చిదిద్దాలి: జ‌డ్జి రాధిక‌

కలం, నిర్మల్: నేర ప్రవృత్తిని విడనాడి సమాజానికి ఉపయోగపడే పౌరులుగా మారాలని జిల్లా అసిస్టెంట్ సెషన్స్ జడ్జి రాధిక (Judge Radhika) సూచించారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని నిర్మల్ జిల్లా కేంద్రంలోని స్పెషల్ సబ్‌ జైల్లో శుక్రవారం ఖైదీల సంక్షేమ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి రాధిక మాట్లాడుతూ.. ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు.

జైళ్లలో ఉన్న ఖైదీలలో పరివర్తన తీసుకువచ్చి, వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్ది తిరిగి సమాజంలోకి తీసుకురావడమే ఖైదీల సంక్షేమ దినోత్సవం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. గతాన్ని పక్కనపెట్టి మంచి మార్గంలో నడుస్తూ కుటుంబానికి, సమాజానికి ఉపయోగపడే విధంగా జీవించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ సబ్‌ జైల్ పర్యవేక్షణ అధికారి పి. సూర్యప్రకాశ్‌రెడ్డి, జైలు సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>