బీజేపీ ఆధ్వర్యంలో లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు

కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి (Lal Bahadur Shastri Jayanti) వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రి చిత్రపటానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ అభివృద్ధి, సమగ్రత కోసం లాల్ బహదూర్ శాస్త్రి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.

ఆయన ఆశయాలను నేటి తరం ఆదర్శంగా తీసుకుని దేశ సేవలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దశరథ్ పోశెట్టి, సీనియర్ నాయకులు అడెపు సుధాకర్, పంతికే ప్రకాష్, రచ్చ మల్లేష్, రావుల రాము, ద్యాగ ప్రకాష్, తోట సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>