కలం వెబ్ డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో (Assembly Debate) భాగంగా చివరి రోజు సభ కొనసాగుతోంది. నేడు కృష్ణా జలాలపై (Krishna Water) ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (PPT) ఇవ్వనుంది. బీఆర్ఎస్ (BRS) అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్‌తో పాటు మాజీ మంత్రి హరీష్ రావుకు మంత్రులు కౌంటర్ ఇచ్చారు. మామ ప్రశ్నించమంటే అల్లుడు పారిపోయాడంటూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ విమర్శించారు.
ముందు కృష్ణా జలాల గురించి చర్చ జరగాలని పట్టుబట్టింది కేసీఆరేనని, ఇప్పుడు మాత్రం సభకు రావడం లేదని బీర్ల ఐలయ్య కామెంట్ చేశారు. బీఆర్ఎస్ తప్పిదాలు బయటపడతాయన్న భయంతో సభకు రాలేదని మంత్రి జూపల్లి విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు బయట ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ.. అసెంబ్లీలో చర్చకు రావాలంటే భయపడుతున్నారని మంత్రి వాకిటి శ్రీహరి విమర్శించారు.

Read Also: స్క్రాప్ నుంచి సూపర్ బైక్.. ఇండియా స్టూడెంట్స్ ఇన్నొవేషన్ అదరహో!
Follow Us On: Pinterest


