క‌లెక్ట‌ర్ వద్దకు ఎర్రవల్లి భూముల సర్వే నివేదిక‌

కలం, మెదక్ బ్యూరో : సిద్ధిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి గ్రామంలోని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్‌హౌస్ పరిసర ప్రాంతాల్లో రెవెన్యూ, సర్వే అధికారులు చేపట్టిన భూముల సర్వే సంబంధించిన నివేదిక‌ను (Erravalli Land Survey Report) జిల్లా క‌లెక్ట‌ర్ హైమ‌వ‌తి కి గ‌జ్వేల్ ఆర్డీవో చంద్రకళ‌, స‌ర్వే ఏడీ సుదర్శ‌న్ నాయ‌క్ అందిచారు. అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు ఫామ్ హౌస్ చుట్టుపక్కల ప్రాంతాల్లో రెవెన్యూ, సర్వే శాఖల ప్రత్యేక బృందాలు సర్వే నిర్వహించారు.​

దాదాపు 8 రోజులపాటు గజ్వేల్ ఆర్డీవో పర్యవేక్షణలో తహసీల్దార్, ల్యాండ్ సర్వే అసిస్టెంట్ డైరెక్టర్, ఇతర రెవెన్యూ సిబ్బంది పలు బృందాలుగా ఏర్పడి హద్దుల గుర్తింపు, శాటిలైట్ మ్యాపింగ్, సేత్వార్ రికార్డుల ఆధారంగా ఈ భూ కొలతలు నిర్వహించారు. ప్రధానంగా ఎర్రవల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 325 లోని సుమారు 388 ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్ భూములకు సంబంధించి సరిహద్దులు, కొలతలు గుర్తించారు. స‌ర్వేలో భాగంగా మొదటి రెండు రోజులపాటు ఎర్రవల్లి, శివారు వెంకట పూర్ గ్రామాల రికార్డ్స్ పరిశీలన చేశారు.

తర్వాత సర్వే పరిధిలోని భూముల్లో ఉన్న దాదాపు 240 మందికి పైగా రైతులకు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేసి, క్షేత్రస్థాయిలో వారి భూమి వివరాలు, హక్కు పత్రాలు పట్టాదార్ పాస్‌పుస్తకాలు పరిశీలించారు. ఎర్రవల్లి లో నిర్వహించిన సర్వే వివరాలను, అధికారులు పూర్తి స్థాయిలో క్రోడీకరించి స‌మ‌గ్ర నివేదిక‌ను సిద్దిపేట క‌లెక్ట‌ర్ హైమ‌వ‌తి సమర్పించారు. ఎర్ర‌వ‌ల్లి కి సంబంధించిన స‌ర్వే రిపోర్టును ప‌రిశీలించిన త‌ర్వాత తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అసెంబ్లీ వేదికగా రాజకీయ దుమారం రాజేసిన కేసీఆర్ ఫామ్ హౌస్ భూముల వ్యవహారం, సర్వే ఉద్రిక్త పరిస్థితుల మధ్య జరిగింది. అధికారులు ఇచ్చినా నివేదికలో ఏమందనే అంశంపై అధికార కాంగ్రెస్ , ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. రాజ‌కీయంగా దూమ‌రం లేపిన ఎర్ర‌వ‌ల్లి భూముల స‌ర్వే నివేదిక బ‌య‌ట‌కు ఎప్పుడు వ‌స్తుందని ఎదురుచూసే ప‌రిస్ధితులు ఉన్నాయ‌. నివేదికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ప్ర‌భుత్వం ఏవిధంగా స్పందించ‌బోతున్న‌ర‌నే అంశం కీల‌కంగా మార‌నుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>