కలం వెబ్ డెస్క్ : తిరుమలలోని శ్రీ గోవిందరాజస్వామి (Govindarajaswamy) ఆలయంలో ఓ మందుబాబు హల్చల్ చేయడం కలకలం రేపింది. పోలీసుల కళ్లుగప్పి ఆలయంలోకి వచ్చిన వ్యక్తి ఏకంగా ఆలయ గోపురం ఎక్కేశాడు. తనకు మద్యం కావాలని, లేదంటే కిందికి దిగనని పట్టుబట్టి కూర్చున్నాడు. శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. సదరు వ్యక్తి టీటీడీ (TTD) విజిలెన్స్ సిబ్బంది కళ్లుగప్పి ఆలయం గోడ దూకి లోపలికి ప్రవేశించాడు. మహా ద్వారం లోపల ఆలయం గోపురం ఎక్కి కలశాలు లాగేందుకు ప్రయత్నించాడు. పోలీసులు, అధికారులు 3 గంటల పాటు శ్రమించి అతడిని కిందికి దింపారు. అనంతరం అతడిని స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనతో టీటీడీ విజిలెన్స్ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎవరుపడితే వారు ఆలయంలోకి ప్రవేశించేటంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటారని భక్తులు మండిపడుతున్నారు.

Read Also: మా ఫ్యామిలీ అంతా నాన్ వెజ్.. నేను పక్కా వెజిటేరియన్ : జెనీలియా
Follow Us On: Youtube


