బౌలర్లపై గంభీర్ ఫోకస్.. ఇదే ప్లాన్!

కలం, స్పోర్ట్స్​ : 2027 వన్డే ప్రపంచకప్‌కు ముందే యువ బౌలర్లను కఠిన పరిస్థితుల్లో పరీక్షించాలని టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) స్పష్టం చేశాడు. గువాహటి వన్డేలో ఔకిబ్ నబీ, గుర్నూర్ బ్రార్‌కు వచ్చిన అవకాశం అందులో భాగమేనని తెలిపాడు. ఈ మ్యాచ్‌లో గుర్నూర్ బ్రార్ 10 ఓవర్లలో 96 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. అరంగేట్రం చేసిన ఔకిబ్ నబీ 8.5 ఓవర్లలో 84 పరుగులు ఇచ్చాడు. వికెట్ మాత్రం దక్కలేదు. నబీ అరంగేట్రంలో భారత బౌలర్‌గా అత్యధిక పరుగులు ఇచ్చిన రికార్డు నమోదైంది.

అయితే ఈ గణాంకాలతో యువ బౌలర్లను అంచనా వేయకూడదని గంభీర్ చెప్పాడు. ఒత్తిడి ఉన్న మ్యాచ్‌ల్లోనే వారికి అనుభవం వస్తుందని తెలిపాడు. ప్రపంచకప్‌లోనూ ఇలాంటి ఒత్తిడి ఉంటుందని వివరించాడు. గుర్నూర్‌ను తొలి 10 ఓవర్లలో, డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయించడం కూడా అందులో భాగమేనని గంభీర్ పేర్కొన్నాడు. కఠిన పరిస్థితుల్లో ఎక్కువగా బౌలింగ్ చేస్తే భవిష్యత్తులో భారత జట్టుకు ఉపయోగపడుతుందని చెప్పాడు.

గువాహటి పిచ్‌పై కూడా గంభీర్ (Gautam Gambhir) అసంతృప్తి వ్యక్తం చేశాడు. బ్యాటర్లు, బౌలర్ల మధ్య మరింత పోటీ ఉండాలని అభిప్రాయపడ్డాడు. ఇలాంటి పిచ్‌లపై బౌలర్లకు పెద్దగా అవకాశాలు ఉండటం లేదని చెప్పాడు. ఐదు మంది ఫీల్డర్లు 30 యార్డ్ల లోపల ఉండటం, రెండు కొత్త బంతులు, ఆధునిక బ్యాటర్ల పవర్ హిట్టింగ్‌తో బౌలర్లకు అవకాశాలు తగ్గుతున్నాయని గంభీర్ వివరించాడు.

అందుకే బౌలర్ల గణాంకాలను మాత్రమే కాకుండా వారు తమ ప్రణాళికలను ఎంతవరకు అమలు చేశారో చూడాలని గంభీర్ తెలిపాడు. యువ బౌలర్లకు కొంత అదనపు మద్దతు, వెసులుబాటు అవసరమని పేర్కొన్నాడు.

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>