కలం, వెబ్ డెస్క్ : గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపుల్లో జాప్యానికి ముగింపు పలికేందుకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) కీలక నిర్ణయం తీసుకుంది. చెక్కులపై సంతకాల విషయంలో సర్పంచ్, ఉప సర్పంచ్‌ల మధ్య తలెత్తుతున్న వివాదాలతో చెల్లింపుల్లో వివాదాలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంది. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు జిల్లా పంచాయతీ అధికారులకు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
చెక్కులపై సంతకాలు చేయడంలో ఉప సర్పంచ్‌లు కారణం లేకుండా జాప్యం చేస్తే చర్యలు తీసుకునేందుకు వీలుగా ఆదేశాలు ఇచ్చారు. ఏడు రోజులకు మించి ఎలాంటి కారణం లేకుండా సంతకాలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తే ఆయా జిల్లా కలెక్టర్ విచారణ చేపట్టాలని సూచించారు. ఒకవేళ ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేసినట్లు విచారణలో తేలితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
అలాగే, ఏడు రోజులకు మించి కారణం లేకుండా చెక్కులపై సంతకాలు చేయకుండా నిలిపివేస్తే.. ఉప సర్పంచ్ స్థానంలో పంచాయతీ కార్యదర్శి, ఎంపీవో లేదా ఎంపీడీవోల్లో ఒకరికి జాయింట్ చెక్ పవర్ కల్పించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం (Telangana Govt) కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. ఈ నిర్ణయంతో పంచాయతీల్లో బిల్లుల చెల్లింపులకు అడ్డంకులు తొలగడంతో పాటు సర్పంచ్, ఉప సర్పంచ్‌ల మధ్య చెక్కుల విషయంలో తలెత్తే వివాదాలకు చెక్ పడే అవకాశం ఉంది.
Also Read : తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు!
Follow Us On: X(Twitter)

