తల్లీకూతుళ్లపై దుండగుల దాడి.. కూతురు మృతి

కలం, పరకాల: పరకాలలో (Parakala) తల్లి, కూతురిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో కూతురు కోడెల సుగుణ (60) అక్కడికక్కడే మృతి చెందగా, తల్లి కోడెల లక్ష్మి (86) తీవ్రంగా గాయపడ్డారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన లక్ష్మిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఇంటికి సమీపంలోని సూపర్‌ మార్కెట్‌ సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తూ నిందితుల వివరాలు సేకరిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>