మసాయిపేటలో ఘనంగా అంగన్ మిలన్

కలం, యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట మండలం మసాయిపేట గ్రామంలోని అంగన్‌వాడీ (Masaipet Anganwadi) కేంద్రాల్లో బీజేపీ గ్రామశాఖ ఆధ్వర్యంలో ‘అంగన్ కా మిలన్’ (Angan Ka Milan) కార్యక్రమాన్ని నిర్వహించారు. అంగన్‌వాడీ టీచర్ బండకింది నిర్మలను శాలువాతో సన్మానించారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రంలోని చిన్నారుల బాగోగులను అడిగి తెలుసుకుని, వారికి ఆట వస్తువులను అందజేశారు. అంగన్‌వాడీలో చదువుకుంటున్న చిన్నారులకు భవిష్యత్తులో ఏదైనా సహాయం అవసరమైనా తమ వంతు సహకారం అందిస్తామని బీజేపీ నాయకులు కళ్లెం శ్రీనివాస్ గౌడ్, హామీ ఇచ్చారు.

చిన్నారుల విద్యాభివృద్ధికి, వారి అవసరాలకు అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ మండల అధ్యక్షులు కళ్లెం శ్రీనివాస్ గౌడ్, బూత్ అధ్యక్షులు గుజ్జ శేఖర్, కోలా విక్రమ్, మాజీ మండల ప్రధాన కార్యదర్శి నేరెళ్ల సంతోష్, సోషల్ మీడియా ఇన్‌చార్జి గుజ్జ నరేంద్ర, బూత్ ప్రధాన కార్యదర్శి ఇట్టెపు ప్రసాద్ పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>