కలం, మహబూబ్ నగర్ బ్యూరో : పిల్లల శారీరక మానసిక వికాసానికి పౌష్టికాహారం ఎంతో అవసరం అని మహబూబ్‌నగర్ (Mahabubnagar) మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు. గురువారం మహబూబ్‌నగర్ పట్టణంలోని టిడి గుట్టలో ‘పోషణ మాసం’ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఐసీడీఎస్ ప్రాజెక్ట్ మహబూబ్‌నగర్ అర్బన్ ఆధ్వర్యంలో “మన ఊరు – మన అంగన్‌వాడీ” కార్యక్రమంలో భాగంగా టి.డి. గుట్ట – 6 సెంటర్‌లో ‘పోషణ మాసం’ పోషక ఆహార వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుమ్మల మమతా శ్రీనివాస్ ముదిరాజ్ విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లల శారీరక, మానసిక వికాసానికి పౌష్టికాహారం ఎంతగానో అవసరమని, ప్రతి ఒక్కరూ పోషకాహార లోపం లేకుండా ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 14వ వార్డు కార్పొరేటర్ ఇమ్రాన్ షరీఫ్ , 35వ వార్డు కార్పొరేటర్ ఫకృద్దీన్ , సీపీడీవో రూప రాణి , అంగన్‌వాడీ సూపర్వైజర్లు, కార్యకర్తలు, ఆయా ల బృందం తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

