కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తన ఆస్తులపై కీలక ప్రకటన చేశారు. 2006లో తనకు ఒక హోటల్ ఉండేదని.. 20 ఏళ్లలో పెరిగి అది మూడు హోటళ్లుగా మారాయన్నారు. హోటల్ వ్యాపారం అనేది తన కుటుంబ ఆదాయం కోసమే పెట్టుకుందని.. ఈ విషయాన్ని ఎన్నికల అఫిడవిట్లో స్పష్టంగా చెప్పానని తెలిపారు. రాజకీయం వదిలేసి హోటల్ వ్యాపారంపైనే దృష్టి పెట్టి ఉంటే.. ఇప్పటికీ పది హోటళ్లు స్థాపించుకునేవాడినన్నారు.
తన తండ్రి 43 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారని.. ఆయన కుటుంబానికి చింతమడక(Chinthamadaka)లో వందల ఎకరాల ఆస్తులు ఉండేవని కేటీఆర్ అన్నారు. వాటికి సంబంధించిన పత్రాలను సీఎంకు పంపిస్తానన్నారు. రేవంత్ రెడ్డి నేపథ్యం ఏంటన్నారు. పెయింటర్ పని చేసుకునే వ్యక్తికి ఇన్ని రూ.వేల కోట్లు ఆస్తులు ఎలా వచ్చాయన్నారు. సుప్రీం కోర్టు జడ్జికి లేఖ రాసి.. ఎవరి ఆస్తులు ఎంతో తేల్చుకుందామన్నారు. సిద్ధమేనా.. అని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు.
సిరిసిల్లలో 35 మంది ఆత్మహత్యలు..
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సిరిసిల్ల నియోజకవర్గంలో 35 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని కేటీఆర్ (KTR) ఆరోపించారు. దండయాత్రకు బయల్దేరినట్లుగా సిరిసిల్లకు వెళ్లారని విమర్శించారు. ఆత్మహత్య చేసుకున్న వారిని ఆదుకుంటారు కావొచ్చని తాను భావించానని.. కానీ ఎప్పటిలాగానే తమను తిట్టడానికే సభ పెట్టుకున్నట్లు ఉందన్నారు. రూ.5 లక్షలతో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన నేతన్నల అభయహస్తం పథకాన్ని నిలిపేశారని, బతుకమ్మ చీరల ఉత్పత్తిని ఆపేశారన్నారు. నల్లమల పులి అని చెప్పుకునే సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy).. నాలుగు వేల మందితో సిరిసిల్లలో పాదయాత్ర చేపట్టారని విమర్శించారు. ఎందుకంత భయమన్నారు. ఆయన చుట్టుపక్కల పోలీసులు తప్ప ఎవరూ లేరన్నారు. అసలు రేవంత్ రెడ్డి ఎందుకంత అహసనంతో ఉంటారో తనకు అర్థం కావడం లేదని ఆరోపించారు.
Also Read : రవీంద్రభారతిలో జూపల్లిని అడ్డుకున్న కళాకారులు!
Follow Us On: Youtube

