ఓయూలో గంజాయి.. క్యాంపస్‌లో కలకలం!

కలం, వెబ్ డెస్క్: ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University)లో గంజాయి మొక్క కనిపించడంతో క్యాంపస్‌లో ఒక్కసారిగా కలకలం రేపింది. మొక్కలు, చెట్లు అధికంగా ఉన్న ప్రాంతంలో గంజాయి మొక్కను కొందరు విద్యార్థులు గుర్తించి, క్యాంపస్ అధికారులకు సమాచారం అందించారు. అనంతరం పోలీసులు కూడా అక్కడకు చేరుకుని.. మొక్క ఎవరు నాటారనే విషయమై ఆరా తీస్తున్నారు. ఆ ప్రాంతంలో జనసంచారం పెద్దగా లేకపోవడంతో కావాలనే అక్కడ మొక్క నాటారా.. లేకపోతే క్యాంపస్‌లో ఎవరైనా గంజాయికి అలవాటు పడి నాటి ఉంటారా.. అనే దానిపై వివరాలు సేకరిస్తున్నారు.

గంజాయి సిగరెట్ ఉపయోగించి అక్కడ పడేయంతో ఇటీవల పడిన వర్షాలకు మొలకెత్తిందా..? అనేది కూడా ఆరా తీస్తున్నారు. రాష్ట్రానికే తలమానికమైన ఓయూలో మత్తు పదార్థాల ఆనవాళ్లు కనిపించడంతో ఆందోళన నెలకొంది. దీనిపై వెంటనే విచారణ జరిపించి, క్యాంపస్‌లో డ్రగ్స్ వినియోగించేవారు, సరఫరా చేసేవారు ఎవరైనా ఉంటే కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>