కలం, వెబ్‌డెస్క్: మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao)కు హైదరాబాద్లోని రవీంద్రభారతిలో చేదు అనుభవం ఎదురైంది. తెలంగాణ సాంస్కృతిక సారథిలో తమకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ కొందరు కళాకారులు రెండు రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం రవీంద్ర భారతి ముట్టడికి పిలుపునిచ్చారు. నేడు సైతం మంత్రి కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. అదే సమయంలో జూపల్లి కార్యాలయం నుంచి బయటకు రాగా కళాకారులు నినాదాలతో హోరెత్తించారు.
తమకు వెయ్యి ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మెట్లపైనే కూర్చొని మంత్రి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. అయితే పోలీసులు, అనుచరుల సాయంతో మంత్రి బయటకు వచ్చేశారు. మంత్రి కాళ్లపై పడి ఉద్యోగాలు ఇవ్వండని వారు వేడుకున్నారు. మంత్రి అక్కడి నుంచి తప్పించుకొని కారు ఎక్కేశారు. తర్వాత కూడా కళాకారులు మంత్రి (Jupally Krishna Rao) కారు ముందుకు వెళ్లకుండా రోడ్డుపై పడుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకొని అందరినీ పక్కకు తొలగించారు.
Also Read : పైలట్ స్మిత్ మచ్ఛర్‌కు ప్రముఖ అవార్డు ప్రకటన
Follow Us On: X(Twitter)

