కలం, వెబ్ డెస్క్: సర్ ప్రక్రియలో భాగంగా ఖైరతాబాద్ నియోజకవర్గంలో 20 వేల ఓట్లు తొలగించారని మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender) ఆరోపించారు. బీజేపీతో ఎన్నికల అధికారులు కుమ్మక్కై.. పెద్ద ఎత్తున ఓట్లు తొలగించారని ఆరోపించారు. దీనిపై వెంటనే స్పందించకపోతే హైదరాబాద్ తగలబడుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు వేసినవారి ఓట్లు తీసేశారని మండిపడ్డారు. ఇంకా ఎంత మంది ఓట్లు తొలగించారో తెలియదన్నారు.
గంపగుత్తగా ఓట్లు తొలగించేశారని.. ఢిల్లీలో కూర్చుని ఓట్లు తొలగించేస్తున్నారని దానం నాగేందర్ (Danam Nagender) విమర్శించారు. ఆన్‌లైన్‌లో ఒక్కసారి సబ్మిట్ చేస్తే.. స్థానిక ఎన్నికల అధికారుల కంట్రోల్ లేకుండా మొత్తం వ్యవస్థ ఈసీ చేతుల్లోకి వెళ్లిపోయిందన్నారు. తొలగించిన 20 వేల ఓట్లను వెంటనే పునరుద్ధరించాలని.. లేకపోతే ఓటు చోరీ అంటూ ఆందోళనలు చేస్తామన్నారు. ఖైరతాబాద్ ఉప ఎన్నిక (Khairatabad Bypoll) రాబోతున్న సమయంలో.. ఈ స్థాయిలో ఓట్లు తొలగించడమేంటన్నారు.
Also Read : విల్లు విసిరిన బంగారు బాణం: తెలంగాణ బిడ్డ సంచలనం!
Follow Us On: Youtube

