బీసీ రిజర్వేషన్లపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల (AP BC Reservation) అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కూటమి ప్రభుత్వం (AP Government) భావిస్తోంది.

హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి, తక్షణమే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం, న్యాయం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, హైకోర్టు ఉత్తర్వుల వల్ల బీసీ వర్గాలకు అన్యాయం జరుగుతుందని అభిప్రాయపడింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>