ఖైరతాబాద్‌‌ ఉప ఎన్నికపై హైకోర్టులో పిటిషన్

కలం, వెబ్ డెస్క్: ఖైరతాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ ఇవ్వకుండా కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలివ్వాలని హైకోర్టులో కాంగ్రెస్ నాయకురాలు విజయా రెడ్డి (Vijaya Reddy) పిటిషన్ దాఖలు చేశారు. 2024లో దానం నాగేందర్‌పై ఎన్నికలకు సంబంధించిన కేసు ఇంకా కోర్టులో పెండింగులోనే ఉందని గుర్తు చేశారు. తుది తీర్పు వెలువరించే వరకు నోటిఫికేషన్ విడుదల చేయకుండా చూడాలని కోరారు. పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు హైకోర్టు నిరాకరించింది. మరోవైపు ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయిందని ఇప్పటికే అసెంబ్లీ సెక్రటరీ గెజిట్ కూడా విడుదల చేశారు.

ఎవరికి టికెట్ వస్తుందో..?

2024 ఏప్రిల్ 10వ తేదీ నుంచే ఈ స్థానం ఖాళీగా ఉన్నట్లు అందులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విజయారెడ్డికి అనుకూలంగా తీర్పు వస్తుందా.. రాదా.. అనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. దానం నాగేందర్‌పై 2024లో విజయారెడ్డి ఎన్నికల పిటిషన్ వేశారు. ఫారం–26లో దానం ప్రకటించిన అంశాలపై అభ్యంతరం చెబుతూ.. ఆ ఎన్నిక రద్దు చేయాలని కోరారు. ఇది ఇంకా పెండింగులోనే ఉంది. ఉప ఎన్నిక నేపథ్యంలో అధిష్ఠానం వీరిద్దరిలో ఎవరికీ టికెట్ ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>