ఇషాన్ కిషన్ ఊచకోత: శ్రీలంకపై భారత్ భారీ స్కోర్!

కలం, స్పోర్ట్స్: ఆసియా క్రీడల (Asian Games) సెమీఫైనల్లో భారత బ్యాటర్లు రఫ్పాడించారు. శ్రీలంకతో జరుగుతున్న కీలక పోరులో భారత్ 169 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇషాన్ కిషన్ (Ishan Kishan) 80 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టుకు కొండంత అండగా నిలిచాడు. టాస్ గెలిచిన శ్రీలంక మొదట బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ స్పిన్ బౌలింగ్‌కు సహకరించడంతో పరుగులు తీయడం కష్టంగా మారింది. భారత్ ప్రారంభంలోనే అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ వికెట్లను త్వరగానే కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన వైభవ్ సూర్యవంశీ 38 పరుగులతో మెరుపులు మెరిపించాడు.

కానీ పెద్ద షాట్ ఆడే క్రమంలో సూర్యవంశీ అవుట్ అయ్యాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, తిలక్ వర్మ కూడా తక్కువ పరుగులకే వెనుతిరిగారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా ఇషాన్ కిషన్ మాత్రం తగ్గలేదు. కేవలం 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆఖరి ఓవర్లలో ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్ చెలరేగి ఆడటంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 169 పరుగులు చేసింది. స్పిన్ కు అనుకూలిస్తున్న ఈ పిచ్ పై 170 పరుగుల లక్ష్యం లంకకు చాలా పెద్దదే. మరి భారత బౌలర్లు ఈ స్కోరును కాపాడుకుని ఫైనల్ చేరతారో లేదో చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>