అమ్రాబాద్ పునరావాస కుటుంబాలకు కలెక్టర్ చేతుల మీదుగా పట్టాలు

కలం, అచ్చంపేట : నాగర్ కర్నూల్ (Nagar Kurnool) జిల్లా అమ్రాబాద్ మండలంలోని అమ్రాబాద్ పులుల అభయారణ్యం (ATR)నుంచి మొదటి విడతలో భాగంగా సార్లపల్లి, కుడిచింతలబైలు, తాటిగుండాల, కొల్లంపెంట గ్రామాలకు చెందిన స్వచ్ఛంద పునరావాసం కోరుకున్న కుటుంబాలకు బుధవారం ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మొత్తం 257 లబ్ధిదారి కుటుంబాలకు నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ (Hemanta Keshav Patil) ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు.

పునరావాస ప్రక్రియలో భాగంగా అర్హత పొందిన కుటుంబాలకు నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్త పల్లి మండలంలోని బాచారం గ్రామంలో లే అవుట్ అనుమతితో ఇండ్ల పంపిణీ జరుగుతుందని, ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను వినియోగించుకోవాలని ఆయా శాఖల అధికారులు సూచించారు. స్వచ్ఛందంగా పునరావాసం కోరుకున్న కుటుంబాలకు ఇళ్ల నిర్మాణం, మౌలిక వసతులు తదితర అంశాల్లో అవసరమైన చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఆయా గ్రామాల లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో డీఎఫ్‌ఓ రేవంత్ చంద్ర, పెద్దకొత్తపల్లి తహశీల్దార్ శ్రీనివాసులు, లింగాల ఎఫ్‌ఆర్‌ఓ ఈశ్వర్, వటువర్లపల్లి ఫారెస్ట్ శిక్షణ అధికారి ధర్మానాయక్, ఎన్‌జీవో బాపురెడ్డితో పాటు సార్లపల్లి గ్రామస్తులు చిర్రాములు సంతోష్, భౌరమ్మ, విష్ణు, తిరుపతయ్య, నారాయణ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>