ముచ్చర్ సాహసం.. మోడీ, ట్రంప్, నెతన్యాహు రియాక్షన్ ఇదే!

కలం, వెబ్ డెస్క్ : దుబాయ్ నుండి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో కో పైలట్ దాడి చేసినప్పటికీ తీవ్ర గాయాలతోనే చాకచక్యంగా వ్యవహరించి 180 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌ (Smit Machchhar) ధైర్యసాహసాలను ప్రపంచ నేతలు కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఈ ఘటనపై స్పందిస్తూ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.

రియల్ హీరో : డొనాల్డ్ ట్రంప్

కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌ను నిజమైన రియల్ హీరో అని డొనాల్డ్ ట్రంప్ ( Donald Trump) అభివర్ణించారు. విమానం గాల్లో ఉండగా తీవ్రమైన గాయాలపాలైనప్పటికీ, సమయస్ఫూర్తితో వ్యవహరించి పెద్ద విపత్తును నివారించడం అత్యంత అద్భుతమైన సంఘటన అని కొనియాడారు.

భారత్ గర్విస్తోంది.. నరేంద్ర మోడీ

కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ ఒక నిజమైన హీరో అని, అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఆయన ప్రదర్శించిన ధైర్యసాహసాలు అసాధారణమైనవని ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) కొనియాడారు. కో-పైలట్ కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచినప్పటికీ, చాకచక్యంగా వ్యవహరించి వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడారని తెలిపారు. స్మిత్ ప్రదర్శించిన ఈ సాహసాన్ని చూసి భారత్‌ ఎంతో గర్విస్తోందని పేర్కొంటూ, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

బెంజమిన్ నెతన్యాహు సెల్యూట్

అసాధారణ పోరాట పటిమను ప్రదర్శించి వందలాది మంది ప్రాణాలను కాపాడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్‌కు నెతన్యాహు (Benjamin Netanyahu) ప్రత్యేకంగా సెల్యూట్ చేశారు. తీవ్ర గాయాలతో ఉన్నప్పటికీ కెప్టెన్ సకాలంలో కాక్‌పిట్ తలుపును తెరిచి అప్రమత్తం చేయడం వల్లే, సిబ్బంది, ప్రయాణికులు లోపలికి వచ్చి దుండగుడిని అదుపులోకి తీసుకోగలిగారని అన్నారు. ఆయన చూపిన తెగువ లేకపోతే విమానయాన చరిత్రలోనే ఒక భయంకరమైన విపత్తు జరిగి ఉండేదని, ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>