కలం, వెబ్ డెస్క్ : ఊహించన ప్రమాదంలో చాకచక్యంగా వ్యవహరించి 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ (Smit Machchhar) ప్రస్తుతం ఆస్పత్రిలో గాయాలతో చికిత్స పొందుతున్నారు. విమానం నడుపుతున్న సమయంలో ఒమన్‌కు చెందిన కో-పైలట్ దాడి చేయడంతో మచ్చర్‌కు మెడ, కడుపు, ముఖంపై దాదాపు 10 కత్తిపోట్లు పడ్డాయి. విపరీతంగా రక్తం ఓడుతున్నప్పటికీ, ఆయన ధైర్యంతో కాక్‌పిట్ తలుపులను తెరిచారు. దీనివల్ల విమాన సిబ్బంది, ప్రయాణికులు వెంటనే స్పందించి పెద్ద ప్రమాదాన్ని అడ్డుకోగలిగారు.
ప్రస్తుతం సౌదీ అరేబియాలోని తబుక్ ఆస్పత్రి ఐసీయూలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే వైద్యులు పలు కీలక శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నప్పటికీ, పూర్తిగా కోలుకోవడానికి మరికొన్ని రోజులు పడుతుందని వైద్య బృందం వెల్లడించింది. భారత అధికారులు మచ్చర్ (Smit Machchhar) కుటుంబ సభ్యులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. ఇదే ఆస్పత్రిలో దాడికి పాల్పడిన కో-పైలట్‌కు కూడా చికిత్స అందిస్తున్నారు. సకాలంలో స్పందించి అందరి ప్రాణాలను కాపాడిన కెప్టెన్ స్మిత్ మచ్చర్ ధైర్యసాహసాలపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read : రష్యా ఆర్మీలోకి భారతీయులు.. కేంద్రం హెచ్చరిక!
Follow Us On : WhatsApp

