గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం!

కలం, నర్సాపూర్‌ (జి): నర్సాపూర్‌ (జి) గ్రామ శివారులోని సుద్ధవాగు (Suddavagu) శ్రీరాంసాగర్‌ బ్యాక్‌వాటర్‌ లో బుధవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైందని ఎస్సై గణేష్ తెలిపారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లిన‌ప్పుడు మృతదేహం కనిపించింది. దీంతో వెంట‌నే వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వయస్సు సుమారు 40 నుంచి 45 సంవ‌త్స‌రాలు ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఎవరికైనా ఆచూకీ తెలిసినట్లయితే ఎస్సై మొబైల్ నంబర్ కు 871265951 సమాచారం ఇవ్వాలని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>