కలం, వెబ్ డెస్క్ : వ్యాపారులకు, హోటల్ నిర్వహకులు, క్యాటరర్లకు పండుగ వేళ బిగ్ షాక్ తగిలింది. వాణిజ్య వినియోగ (కమర్షియల్) ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరల (Gas Price)ను చమురు మార్కెటింగ్ సంస్థలు మళ్లీ పెంచాయి. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌పై రూ.62.50 మేర పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ పెంపుతో దేశ రాజధాని న్యూఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.2,837.50 కి చేరుకుంది. పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని సదరు సంస్థలు వెల్లడించాయి. ఈ నిర్ణయంతో హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వాణిజ్య సంస్థలపై అదనపు భారం పడనుంది.

