అప్పుల బాధ భరించలేక రైతు ఆత్మహత్య!

కలం, నిర్మల్ రూరల్: పంటల దిగుబడి ఆశించిన స్థాయిలో రాక అప్పులు పెరగడంతో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య (Farmer Suicide)కు పాల్పడ్డాడు. నిర్మల్ (Nirmal) రూరల్ ఎస్సై లింబాద్రి తెలిపిన వివరాల ప్రకారం.. డ్యాంగాపూర్ గ్రామానికి చెందిన కడతాల అంజయ్య (41) అనే రైతు తనకున్న మూడెకరాలతో పాటు అన్నయ్యకు చెందిన మరో మూడెకరా భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. పంటలు ఆశించిన స్థాయిలో పండకపోవడంతో సుమారు రూ.8 లక్షల వరకు అప్పులయ్యాయి.

అప్పులు తీర్చే మార్గం లేక‌ మనస్తాపానికి గురైన అంజయ్య మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా, చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్టు ఎస్సై పేర్కొన్నారు.

Also Read : బీఆర్​ఎస్​ పాలనలో ఉరిసిల్లగా మారిన సిరిసిల్ల : సీఎం రేవంత్​

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>