సాగర్ ఆస్పత్రిలో మెరుగైన సేవలకు చర్యలు: డాక్టర్ భాను ప్రసాద్

కలం, నాగార్జునసాగర్: నందికొండ మున్సిపాలిటీ నాగార్జునసాగర్ (Nagarjuna Sagar) లోని ప్రభుత్వ కమల నెహ్రూ ఏరియా ఆసుపత్రి (Kamalanehru Hospital)లో వైద్య సేవలు మెరుగుపడే విధంగా చర్యలు తీసుకుంటున్నామని వైద్య విధాన పరిషత్ ఆసుపత్రిల జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ భాను ప్రసాద్ అన్నారు. గతంలో సాగర్ ఆస్పత్రిలో సీఎంఓగా, ఆర్ఎంఓ గా విధులు నిర్వహించిన భాను ప్రసాద్ నల్లగొండ జిల్లా వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల జిల్లా కోఆర్డినేటర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా నాగార్జునసాగర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన సందర్శించి పరిశీలించారు.

సాగర్ ఆస్పత్రి సందర్శనలో భాగంగా ఆసుపత్రిలో ఓపీ విభాగాన్ని, వివిధ వార్డులలో రోగులకు అందుతున్న వైద్య సేవలను రోగులను అడిగి తెలుసుకున్నారు. వైద్యుల, వైద్య సిబ్బంది సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. సాగర్ ఆస్పత్రిలో కాన్పుల సంఖ్యను పెంచే విధంగా రాత్రి సమయంలో కూడా వైద్యులను అందుబాటులో ఉంచే విధంగా త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం ఆసుపత్రి వైద్యులచే సమీక్ష సమావేశం నిర్వహించారు. వీరితోపాటు సాగర్ ఆస్పత్రి సూపర్డెంట్ డాక్టర్ హరికృష్ణ, ఆర్ఎంఓ అనిత, డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది ఉన్నారు.

Also Read : బీఆర్​ఎస్​ పాలనలో ఉరిసిల్లగా మారిన సిరిసిల్ల : సీఎం రేవంత్​

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>