కలం, స్పోర్ట్స్ : రిటైర్‌మెంట్ చర్చల మధ్య రోహిత్ శర్మ (Rohit Sharma) తన ఫోకస్ ఏంటో స్పష్టం చేశాడు. టెస్టులు, టీ20లకు వీడ్కోలు పలికిన రోహిత్.. ఇప్పుడు వన్డే ఫార్మాట్‌పైనే దృష్టి పెట్టాడు. బయట జరిగే చర్చలు తన ఆటను మార్చలేవని స్పష్టం చేశాడు. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు ముందు రోహిత్ తన ప్రిపరేషన్ గురించి వివరించాడు. ఫిట్‌గా ఉండటం, ఆటకు టచ్‌లో ఉండటం, మ్యాచ్‌లను గమనించడం కీలకమని తెలిపాడు. గతంలో వరుస పర్యాలతో బిజీగా ఉండేవాడినని, ఇప్పుడు తన సమయానికి తగ్గట్టుగా ఫిట్‌నెస్, ప్రిపరేషన్ చూసుకుంటున్నానని చెప్పాడు.
50 ఓవర్ల క్రికెట్‌పై తన ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదని రోహిత్ తెలిపాడు. ఎనర్జీ, ఇంటెన్సిటీ, మైండ్‌సెట్, ఆటపై ఉద్దేశం గతంలో ఎలా ఉన్నాయో ఇప్పటికీ అలాగే ఉన్నాయని స్పష్టం చేశాడు. 2027 వన్డే వరల్డ్ కప్ (ODI World Cup 2027) తన ముందున్న లక్ష్యాల్లో ఒకటని రోహిత్ (Rohit Sharma) చెప్పాడు. అయితే అదే తన చివరి టోర్నీ అని మాత్రం స్పష్టంగా చెప్పలేదు. ఆటలో ఉన్నంతకాలం ముందుకు చూడటానికి ఏదో ఒకటి ఉంటుందని పేర్కొన్నాడు. వెస్టిండీస్‌తో తొలి వన్డేలో రోహిత్ 35 బంతుల్లో 32 పరుగులు చేశాడు. ఇందులో మూడు సిక్సర్లు, రెండు ఫోర్లు ఉన్నాయి. ఆ మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో గెలిచింది.
Also Read : మాంచెస్టర్ సిటీకి షాక్.. రూల్స్ అతిక్రమణలో దోషి!
Follow Us On : WhatsApp

