దేవుళ్లను విభజించే యత్నం సనాతన ధర్మానికే విరుద్ధం: బండి సంజయ్

కలం, ​కరీంనగర్ బ్యూరో: ​దేవుళ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) నిప్పులు చెరిగారు. ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి “రాముడు ధనికుల దేవుడు, శివుడు పేదల దేవుడు” అని, బీజేపీ రాముడిని తన సొంతం చేసుకుంటూ రాజకీయం చేస్తోందని చేసిన వ్యాఖ్యలను బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. రాజకీయ లబ్ధి కోసం చివరికి దేవుళ్ల మధ్య కూడా కాంగ్రెస్ పార్టీ విభజన రేపుతోందని మండిపడ్డారు.

‘శివాయ విష్ణురూపాయ.. శివరూపాయ విష్ణవే’ అనే సనాతన ధర్మ సూత్రం ప్రకారం శివుడు, విష్ణువు (రాముడు) ఒకే తత్వమని, రాజకీయ ప్రయోజనాల కోసం దేవుళ్లను వర్గాలుగా, ప్రాంతాలుగా వర్గీకరించడం సనాతన ధర్మ స్ఫూర్తికే విరుద్ధమని బండి సంజయ్ (Bandi Sanjay) స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో హామీల కోసం దేవుళ్లను సాక్ష్యంగా పెట్టుకుని ఓట్లు పొందిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అదే దేవుళ్లపై రాజకీయ విమర్శలు చేయడం శోచనీయమన్నారు.

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సీడబ్ల్యూసీ సూచనల మేరకు సిలబస్ నుంచి సంఘ్ పరివార్‌ను తొలగించాలని చూడటంపై బండి సంజయ్  మండిపడ్డారు. ఆర్టికల్ 370, కశ్మీర్ అంశం, రజాకార్ల అరాచకాలను మరుగునపరిచేలా చరిత్రను మలిచే యత్నం చేస్తే హిందూ సమాజం ఊరుకోదని తీవ్రంగా హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలను నెరవేర్చలేక, ఆ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ​దేవుళ్ల మధ్య, భక్తుల మధ్య రాజకీయ చిచ్చు పెట్టాలని చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

Also Read : బీఆర్​ఎస్​ పాలనలో ఉరిసిల్లగా మారిన సిరిసిల్ల : సీఎం రేవంత్​

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>